Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 4:47 pm Posted by : ramakrishna

పేదింటి బిడ్డ పెళ్లికి ఎన్ఆర్ఐ ఆర్ధిక సహాయం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో షేక్ ఇస్మాయిల్  కూతురు సనాబేగం వివాహం కొరకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సోమవారం ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నగదును బీజేపి నాయకులు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు బేగరివినోద్ కుమార్, ఈశ్వర్, సాయి కుమార్, పందిరి శివ, శంకర్, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.