Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 5:36 pm Posted by : ramakrishna

ఎన్ఆర్ఈజిఎస్ నిధులు మంజూరు

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం తాల్లారాంపూర్ గ్రామంలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల ద్వార మంజూరైన సీసీ రోడ్డు పనుల ను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ నిధులకు సహకరించిన నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి, గంగా ప్రసాద్, మాజీ సర్పంచ్ రామా గౌడ్, మాజీ సర్పంచ్ తుమ్మల ప్రభాకర్ ,మాజీ ఎంపీటీసీ దిబ్బ సుదర్శన్, పార్టీ నాయకులు బెజ్జారపు భాను, బెజ్జారపు శ్రీనివాస్, గౌతమ్, వడ్ల సుదర్శన్, గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.