రైతులకు ఎన్పీఎస్ఎస్ మొబైల్ అప్లికేషన్ శిక్షణ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని ప్రగతిశీల రైతులకు శుక్రవారం ఎన్పీఎస్ఎస్ మొబైల్ అప్లికేషన్ శిక్షణ కార్యక్రమం సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ స్ట్మేనేజ్‌మెంట్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణలో ఎన్పీఎస్ఎస్ (నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్) మొబైల్ అప్లికేషన్ వినియోగిస్తుందని, తెగుళ్ల నిర్వహణలో దాని ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా రైతులు ఎలాంటి ఆలస్యం లేకుండా తెగులును సులభంగా గుర్తించవచ్చని, తక్షణ నియంత్రణ చర్యలను అనుసరించవచ్చని అన్నారు. ఇది పురుగుమందుల ధరను తగ్గిస్తుందని, తెగులు యొక్క సకాలంలో...