. . . ఈ నెల 21 వరకు దరాఖాస్థుల స్వీకరణ
. . . నిజామాబాద్ బల్ధియాలో అ ముగ్గురు లక్కి పర్సన్స్ ఎవ్వరో
. . . అధికార పార్టి నేతలు ఎవ్వరిని అందలం ఎక్కించెనో
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ నగర పాలక సంస్ధ( ఎన్ ఎం సీ) లో ఖాళీగా ఉన్న మూడు కో అప్షన్ పధవుల భర్తికి నోటిపికేషన్ విడుదలైంది. ఈనెల 13న వచ్చిన ప్రకటనను నాలుగు రోజులకు బయట పెట్టారు నిజామాబాద్ బల్ధియా అధికారులు. తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం మూడు కో అప్షన్ పధవుల భర్తికి ప్రకటన జారీ అయింది. మూడు పోస్టులలో ఒక పోస్టు మహిళకు, మిగిలిన ఇద్ధరు అల్పసంఖ్యాకులు( ముస్లీం, క్రిష్టియన్, బౌద్ధులు, పారసీలు, సిక్కు) సామాజీక వర్గాల నుంచి ఎంపిక చేస్తారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరదిలోని డివిజన్ లో ఓటు హక్కు కలిగిన, 21 సంవత్సరాలు నిండిన, గతంలో మేయర్, డిప్యూటి మేయర్ పధవులను నిర్వహించిన వారు, నగర పాలక సంస్థ పరిధిలోని గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్ పధవులను పూర్తి కాలం నిర్వహించిన వారు అర్హులే. నగర పాలక సంస్థ పరిధిలో మూడు సంవత్సరాలు న్యాయవాధిగా పనిచేసిన వారు, రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలో గేజిటేడ్ హోదాలలో పనిచేసిన వారు కుడా కో అప్షన్ ఎన్నికలలో పాల్గోనుటకు అర్హులుగా నిర్ణయించారు..సంబధింత అర్హహతలు కలిగిన వారు ఈ నెల 21 వరకు నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో దరాఖాస్తుతో పాటు ధ్రువికరణ పత్రాలను జతచేసి సమర్పించాలని నగర పాలక సంస్థ కమీషనర్ దిలిప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు…

నిజామాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో 60 డివిజన్ లు ఉండగా పిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టి 17, మజ్లీస్ 14, బిజేపి 28, బిఆర్ఎస్ 1 స్థానం గెలిచిన విషయం తెలిసిందే.మజ్లీస్, కాంగ్రెస్ పార్టిల మద్య సయోద్య ఒక బిఆర్ఎస్ అభ్యర్ధి మద్ధత్తుతో కాంగ్రెస్ పార్టి మేయర్ స్థానం కైవసం చేసుకుంది. బిజేపి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టి కార్పొరేటర్ కురగాయాల ఉమారాణి మేయర్ కాగా, డిప్యూటి మేయర్ స్థానం మజ్లీస్ పార్టికి కేటాయించారు. ఐదు సంవత్సరాల కాలానికి గాను పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టి మేయర్ స్థానంను కైవసం చేసుకుంది. గత మూడు నెలలుగా బల్ధియా పాలన పడుతు లేస్తు సాగుతుంది. ఇటివల మార్చీ చివరి అంకంలో బల్దియా బడ్జేట్ ను అమోదించుకున్నప్పటికి మున్సిపల్ కార్పోరేషన్ కు ప్రధాన ఆదాయం లేకపోవడంతో డేవలప్ మెంట్ మూడు అడుగులు ముందుకు, ఆరు ఆడుగులు వెనక్కి అన్నచందంగా మారింది..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముచ్చటగా భర్తి కానున్న ముడు కో అప్షన్ పధవులను ఎవ్వరికి దక్కేనో అనే చర్చ జరగుతుంది. అధికారికంగా బల్ధియా అధికారులు ఎంపిక చేయాల్సి ఉండగా అధికార పార్టీ నేతల సిపారసులు పైనల్ అనేది జగ మెరిగిన సత్యం. నిజామాబాద్ బల్ధియా ఎన్నికలలో కాంగ్రెస్ 60 స్థానాలలో పోటి చేస్తే గెలిచింది 17 మాత్రమే. మిత్రపక్షం పతంగి పార్టీ 14 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు ముడూ కార్పొరేషన్ కో అప్షన్ పధవులలో ఎవ్వరికి నామినేట్ చేయాలన్న అధికార పార్టి నేతలకు తలనోప్పే. ఇటివల బల్ధియా ఎన్నికలలో పోటి చేయకుండా త్యాగం చేసిన వారికి ఇవ్వాలా లేక పోటి చేసి ఓటమి చేందిన వారికి ఇవ్వాలా, పార్టి విదేయులకు ఇవ్వాల అనే తలనోప్పి మారింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 50, రూరల్ నియోజకవర్గంలో 10 కార్పొరేటర్ స్థానాలు ఉండగా కో అప్షన్ పధవులకు ఇప్పుడు అధికార పార్టీలో పిసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహదారు సుధర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అర్బన్ ఇంచార్జీ ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ అశీస్సులు తప్పనిసరి. కో అప్షన్ లో ఒకటి మహిళకు, రెండు అల్ప సంఖ్యాకులు( మైనార్టీలు) ఇవ్వాల్సి రావడంతో అందులో మున్సిపల్ చట్టాల ప్రకారం అర్హులను ఎంపిక చేయడం కత్తిమీదా సాములా మారింది. ఈ నెల 21 వరకు ఎవ్వరిని అధికార పార్టి పెద్ధలు దరాఖాస్తులు చేసుకోవాలని కోరుతారో లేక ఎవ్వరి పేర్లు సిపారసు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. దశాబ్ధకాలంగా పార్టికోసం పనిచేసిన వారికి ఇస్తారా లేక ఇతర పార్టి నుంచి వచ్చిన జంప్ జిలానీలకు అవకాశం ఇస్తారా అనే చర్చ జరగుతుంది.