వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ జెట్ స్పీడ్ తో విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ఎవరికోసం, ఎవరి ఆదేశాల మేర కు ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా తొలిసారిగా రాజకీయ ఆగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.