Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 11:07 am Posted by : ramakrishna

నాలుగో స్థానంలో నోటా

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి  ఉన్నారు. అనూహ్యంగా నాలుగో స్థానంలో నోటా కొనసాగుతోంది. ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 10 రౌండ్లు ముగిసే వరకు నోటాకు ఎన్ని ఓట్లు పోలవుతాయోనని ఆసక్తికరంగా మారింది.