ప్రజాపాలన కాదు.. కమీషన్ ల పాలన

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో కొనసాగుతోంది ప్రజాపాలన కాదని, కమీషన్ ల పాలన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతూ దిక్కు తోచని స్థితిలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చాయన్నారు. పాలన చేకగాక కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చేందుకు నాటకాలు వేస్తోందన్నారు. కమీషన్ లు లేనిదే పనులు కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కాళేశ్వరం పై కుట్రలు చేస్తున్నారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ వి చిల్లర ప్రయత్నాలని మండిపడ్డారు.