Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2024, 2:42 pm Posted by : ramakrishna

కాదేదీ కాబ్జాకు అనర్హం

. జాగా కనిపిస్తే పాగా వేస్తున్న నాయకుడు

. ఎమ్మెల్యే పోచారం పేరు చెప్పి బెదిరింపులు

 

బతుకమ్మ, రుద్రూర్: మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు బాన్సువాడ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ అమాయక ప్రజల నోళ్లు మూయిస్తున్నాడని, ఆ నాయకుడి ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలను, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కబ్జా చేసిన వ్యక్తి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా వ్యవహారం తారాస్థాయికి చేరింది. రైతు పొలాలను కబ్జా చేయడంతోపాటు ప్రభుత్వ  స్థలాన్ని కబ్జా  చేసి బోరుబావి తవ్వించాడు.  డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో వసూళ్లకు సైతం పాల్పడుతున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తి ఇటు పెరిక కులాన్ని, అటు ఎమ్మెల్యే ను బద్నాం చేస్తున్నాడని, ఆ వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని మండల కేంద్ర ప్రజలు అంటున్నారు.