పదోన్నతులలో నాట్ విల్లింగ్ అవకాశం కల్పించాలి
టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో స్వచ్ఛందంగా తమకు పదోన్నతి వద్దు అనుకునే వారికి నాట్ విల్లింగ్ ఇచ్చి పదోన్నతి నుండి తప్పుకునే అవకాశాన్ని కల్పించాలని టిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, గంగాధర్ కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతుల్లో ఇప్పటికే రెండుసార్లు తమకు పదోన్నతి వద్దు అని తిరస్కరించిన వారి...