- టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో స్వచ్ఛందంగా తమకు పదోన్నతి వద్దు అనుకునే వారికి నాట్ విల్లింగ్ ఇచ్చి పదోన్నతి నుండి తప్పుకునే అవకాశాన్ని కల్పించాలని టిఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, గంగాధర్ కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతుల్లో ఇప్పటికే రెండుసార్లు తమకు పదోన్నతి వద్దు అని తిరస్కరించిన వారి పేర్లు సీనియార్టీ లిస్టు నుండి తొలగించాలని అన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన పదోన్నతి వద్దనుకునే వారి నుండి నాట్ విల్లింగ్ తీసుకుని లిస్టులో నుంచి తొలగించాలని కోరారు. దీనివలన జూనియర్ ఉపాధ్యాయులకు మరి కొంతమందికి పదోన్నతులు వచ్చే అవకాశం లభిస్తుందని విద్యాశాఖ అధికారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేతరి మల్లేష్, శీను, ప్రతాప్ శ్రీనివాస్ లక్ష్మణ్ రవి, అశోక్, రవీందర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.