Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 7:55 pm Posted by : ramakrishna

నగర మేరు సంఘం కార్యవర్గంకు ముగిసిన నామినేషన్లు   

నిజామాబాద్ సిటి,  బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర మేరు సంఘం కార్యవర్గంకు గురువారంతో నామినేషన్లు పూర్తయ్యాయి. 5,6వ తేదిన నామినేషన్ల పరిశీలన, 7,8 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 9న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారన్నారు. 10వ తేది నుంచి 19 వరకు అభ్యర్థులు ప్రచారం, 21న ఎన్నికలు నిర్వహిస్తారని ఎన్నికల అధికారి సంగ సత్యవ్రత్ , ఎన్నికల అధికారులు బుర్ర సాయిబాబా, రాయల్ వార్ లక్ష్మీకాంత్, యెన్ను సూర్య ప్రకాష్ తెలిపారు. గురువారం హమాల్ వాడి తర్ప నుంచి సంయుక్త కార్యదర్శిగా తాళ్ళ శివకుమార్ తర్ప పెద్దలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంత్ రావు, కొట్టూర్ చంద్రకాంత్, గట్ల సత్యం, వెంకటేష్, ప్రసాద్, గట్ల శ్రీనివాస్ తదితరులున్నారు.