నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కలెక్టరేట్ లోని వీ.సీ హాల్ లో నోడల్ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే...