Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 9:13 pm Posted by : ramakrishna

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సందర్బంగా అండర్ సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ( గతంలో 144 సెక్షన్ క్రింద) అమలు లో ఉంటుందని వెల్లడించారు. జిల్లా లోని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (58) సెంటర్లలో ఎగ్జామినేషన్ ఉంటుందని ఆయనన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని, నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దని, పరీక్షా కేంద్రాo నుండి 200 మీటర్ల వరకు పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌లను ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలని హెచ్చరించారు.