Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 12:43 pm Posted by : ramakrishna

స్ట్రెచర్ లేదు చేతులే దిక్కు..

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్  జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్నాయని ఈ చిత్రాలు. ప్రతి రోజు వేలాది మంది ఎన్నో ఆశలతో వచ్చే జీజీహెచ్ లో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ రోగిని అంబులెన్స్ లో తీసుకురాగా,  స్ట్రెచర్ లేకపోవడంతో రోగి బంధువులే చేతులపై లోనికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వద్ద పట్టించుకునే వారు లేరని, సమస్య ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు.