Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 12:02 pm Posted by : ramakrishna

ఇక నుంచి షూటింగ్ లు జరగవు : ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్

 

సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య వివాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ : సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య వివాదం మరో సారి వేడెక్కింది. ఇక నుంచి షూటింగ్ లు జరగవని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్  వల్లభనేని అన్నారు. ఫెడరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాత విశ్వ ప్రసాద్ ఎందుకు నోటీసులు పంపారో అర్ధం కావడం లేదన్నారు.  ఛాంబర్ తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు. ఛాంబర్ తో మాట్లాడాతామన్నారు. మంత్రి కోమటి రెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత పద్ధతి రూల్స్ ప్రకారం మాత్రమే పని చేస్తామని నిర్మాతలకు స్పష్టం చేశారు. సినీ కార్మికులు కడపుకాలితే వాళ్లే తిరిగి వస్తారని నిర్మాతలు అనుకోవడం అవమానకరమన్నారు. వేతనాల పెంపు విషయంలో మాత్రం స్కిల్స్ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. అందరం ఐక్యంగా కలిసి పోరాడదమని పిలుపునిచ్చారు. ఈవిషయమై రెండు మూడు రోజుల్లో కార్మిక సంఘాలన్నీ ఛాంబర్ ను ముట్టడించే అవకాశముంది.