Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 5:47 pm Posted by : ramakrishna

మూడు నెలలుగా జీతాలు లేవు

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండలంలో ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని బాల్కొండ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డికి జీతాలు ఇప్పించండి అంటూ గురువారం ఉపాధి హామీ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.