Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 9:59 pm Posted by : ramakrishna

అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు నిర్వహించకూడదు

 

. . . జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జూన్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజా ఆస్తులకు, ప్రభుత్వ ధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పోలీసు శాఖకు సంపూర్ణంగా సహకరించాలని ఎస్పీ కోరారు. చట్టాన్ని అతిక్రమించి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, నిరసనలు చేపట్టినా.. సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.