యూనివర్సిటీల్లో పార్ట్ టైం వద్దు.. కాంట్రాక్టు ముద్దు
పార్ట్ టైం లెక్చరర్స్ డిమాండ్ సీఎంకు ప్రత్యేక వినతి ఎన్నికల హామీపై గంపెడాశలు ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు అయ్యా! గౌరవ ముఖ్యమంత్రి గారు.. మేము తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లం. పీహెచ్డీలు చేసి, నెట్, సెట్ అర్హత పరీక్షలు రాసి, ఆచార్య నియామక అర్హతలు పొందిన అభ్యర్తులం. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల విద్యార్థులుగా ఉద్యమించిన బిడ్డలం. స్వరాష్ట్ర సాధనలో యుక్త వయస్సు కోల్పోయి, నీళ్ళు, నిధులు, నియామకాలు జరుగుతాయని ఆశ పడ్డ తెలంగాణవాదులం. వయస్సు మితి మీరుతున్న తెలంగాణ సాధన...