Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 7:50 pm Posted by : ramakrishna

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సమాజంలో ఉద్రిక్తతలకు రేపే విధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య హెచ్చరించారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో మాజీద్ ఖాన్ అనే వ్యక్తి కుటుంబంపై పాతకక్షల నేపథ్యంలో తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల అశోక్, సంఘముల నిఖిల్, వడ్లూరి రంజిత్ కుమార్, కటికే రమేష్ వీరందరూ కలిసి ముప్పేట దాడి చేశారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరెట్ పరిధిలో ఎవ్వరైన ఎలాంటి అల్లర్లకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై  పూర్తి స్థాయి ” నిఘా వ్యవస్థ” ఉంటుందని ప్రతీ ఒక్కరు తమ నడవడికను మార్చు కోవాలని,లేని యెడల వారి పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.