Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 12:26 pm Posted by : ramakrishna

కంచె భూములు ఎవరు కొనొద్దు

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు

కేటీఆర్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తమ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి ఎవరైనా ఆ భూముల్ని కొనుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. అక్కడ అద్భుతమైన ఏకో పార్క్ ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామన్నారు.  హెచ్ సీయూ భూముల వివాదంపై తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి హృదయపూర్వక సెల్యూట్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి నిర్ణయాన్ని మార్చుకోకపోతే వేలాది మందితో హెచ్ సీయూకి మార్చ్ లాగా తరలి వెళ్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పేయిడ్ బ్యాచ్ అనడం సీఎం, మంత్రుల అహంకారానికి నిదర్శనమన్నారు. అక్కడ జంతువులే లేవు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అని భట్టి విక్రమార్క తన కృత్రిమ మేధను బయట పెట్టుకున్నాడని విమర్శించారు. మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా.. ఎమ్మెల్సీలైనా.. అందరూ ప్రజా సేవకులేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అనువంతైనా లేదన్నారు. ఫుట్ బాల్ ఆడడానికి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమతో ఫుట్ బాల్ ఆడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం 14000 ఎకరాలను పెట్టుకొని ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చి ఎన్నో జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను సాధించామన్నారు. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి మేము కొట్లాడలేదని, ఢిల్లీ లాగా హైదరాబాద్ మారొద్దన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్స్ స్పేస్ ఉండాలన్న దూర దృష్టితో మేము కొట్లాడామన్నారు. హెచ్ సీయూ విద్యార్థులకు న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఇది రాజకీయ కొట్లాట కాదు హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమన్నారు. ఈ పోరాటంలో కలిసివచ్చే పర్యావరణవేత్తలకు అండగా ఉంటామన్నారు. రాహుల్ గాంధీ ఓ లాపతా లీడర్.. పొలిటికల్ టూరిస్ట్ అని వ్యాఖ్యనించారు. బండి సంజయ్ ఓ ఐటమ్ నంబర్ సిక్స్ అని, అప్పుడప్పుడు పార్లమెంటుకు వెళ్లి భారత ప్రభుత్వ నివేదికలని చదువుకోవాలని సూచించారు. తంబాకు నమ్ములుకుంటూ ఆడాయిడా తిరగవద్దని, టైం పాస్ చేయొద్దని బండిసంజయ్ కు  మంచిది కాదని వ్యాఖ్యనించారు.