బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం సావేల్ గ్రామానికి చెందిన మాల, మాదిగ కులస్తులని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారని గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు శుక్రవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మేము మా గ్రామంలో ఎవరిని కూడా బహిష్కరించలేదని తెలిపారు. మా గ్రామం ఏర్పడినప్పటి నుండి అందరం ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటున్నామని పేర్కొన్నారు.