Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 10:44 am Posted by : ramakrishna

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఎవరికీ రాని నిర్ధారిత కోటా ఓట్లు

 

. . . ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం

. . . రెండో ప్రాధన్యత ఓట్లే కీలకం

కరీంనగర్, బతుకమ్మ:

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠత రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలు ఫలితాల వరకు అభ్యర్థులతో పాటు ఓటర్లలోను ఫలితాలు అసక్తి రేకేత్తిస్తున్నాయి. మంగళవారం ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం వరకు 21 టేబుల్ లో 21 వేల ఓట్ల లెక్కింపును 11 రౌండ్లలో చేపట్టారు. అయినప్పటికి గెలుపు కోటాగా నిర్ధారణ ఓట్లు 1,11,672 ఏ అభ్యర్థి సాధించలేకపోయారు. మొత్తం చెల్లిన ఓట్లు 2,23,343 కు గాను 11 రౌండ్లలో బిజేపి అభ్యర్థి అంజిరెడ్డి 75,675. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 60,419 ఓట్లు సాధించారు. పోటీలో ఉన్న మిగతా పోటీదారులు 53 మంది అందరికీ కలిపి వచ్చిన ఓట్లు  16,784 కాగా అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. గెలుపు కోటాను చేరాలంటే కావలసిన రెండో ప్రాధాన్యత ఓట్లలో అంజిరెడ్డి  35,997, నరేందర్ రెడ్డి  41,107, ప్రసన్న హరికృష్ణ 51,253 ఓట్లు రావాల్సి ఉంది. కాబట్టి  రెండో ప్రాధన్యత ఓట్ల లెక్కింపు ద్వారా విజేతలను ప్రకటించే అవకాశం ఉంది.

No one gets the fixed quota votes in the counting of graduates' MLC votes