–స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ. ఎం రేవంత్ రెడ్డి మత సామరశ్యంతో ముందుకు వెళ్తున్నారని, కొందరు దానికి తూట్లు పొడవాలని చూస్తున్నరని స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం
బీమ్ గల్ మండల కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
క్రిస్టమస్ అంటే ఏసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన రోజు అని అన్నారు. దేశం లో మత సామరస్యాన్ని ఎవరు విడగొట్టలేరని,దేశం 75 సంవత్సరాలకు పైగా కలిసి వుందన్నారు. 25 న జరిగే క్రిస్టమస్ వేడుకను ప్రతి క్రిస్టియన్ సోదరుడు ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరుస్తూ ఇచ్చిన హామీలను నేరవేరుస్తుందన్నారు.రేవంత్ రెడ్డి కి ఏసు ప్రభువు అండగా ఉండాలని ప్రార్తించారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం అందించామని, పేద కుటుంబాలకు 200 వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో 2014 ముందు పావుల వడ్డీకే మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు ఇచ్చిందని, అదే తరహాలో మహిళలకు రూ.1800 కోట్ల రుణాలు మహిళా సంఘలకు అందించే విధంగా యంత్రాంగం ముందుకు వెళ్తుందని అన్నారు.దీనికి పూర్తిగా వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
జనవరిలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధంగా ఆలోచనాతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడించారు.ఈ సందర్బంగా చర్చ్ పాస్టర్ లు ప్రార్ధనలు నిర్వహించి, మోహన్ రెడ్డి కి శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఆర్డీఏ అధికారి,బాల్కొండ నియోజకవర్గ చర్చ ఫాదర్ లు,వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి,కమ్మర్పల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, వేల్పూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి,బాల్కొండ వెంకటేష్ గౌడ్, భీంగల్ స్వామి,ముపకల్ ముత్యం రెడ్డి,నాగేంద్ర బాబు,గంగా ప్రసాద్,చరణ్ గౌడ్,అత్మరం,భూమరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.