Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 5:14 pm Posted by : ramakrishna

మాకేవ్వరు అడిగేది.. అంతా మా ఇష్టం…

 

. . . చీతా ఫోర్స్ అధికారులు ఎక్కడ ?

 

. . . రాత్రి వేళల్లో యదేచ్చగా మొరం, ఇసుక, మట్టి అక్రమ రవాణా

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు కోటగిరి, పోతంగల్, బీర్కూర్ మండలాల్లో మొరం, ఇసుక, మట్టి అక్రమంగా రవాణా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలివెత్తుతున్నాయి. ప్రస్తుతం నూతనంగా చీతా ఫోర్స్ అధికారులు వేట మొదలుపెట్టారు. కానీ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంతో పాటు కోటగిరి, పోతంగల్, బీర్కూర్ మండలాల్లో రాత్రి వేళల్లో జోరుగా అక్రమంగా ఇసుక, మొరం, మట్టి రవాణా యదేచ్చగా కొనసాగుతున్న చీతా ఫోర్స్ అధికారులు ఇక్కడ కన్నెత్తి కూడా చూడడం లేదనె ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలో కూడా చీతా ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే అక్రమ మొరం, ఇసుక, మట్టి మాఫియా దారుల ఆగడాలను అరికట్టవచ్చని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇసుక, మొరం, మట్టి మాఫియా దారులు అధికారుల అండ దండలతో  రోజుకు రోజుకు మితిమీరి పోతున్నారని, మాకెవరులే అన్న చందంగా మారింది వీరి వ్యవహార శైలి. కావున చీతా ఫోర్స్ అధికారులు వెంటనే స్పందించి రుద్రూర్ మండల కేంద్రంలో అక్రమంగా మొరం, ఇసుక, మట్టి రవాణాపై దాడులు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 

No one asks us.. everything is our choice...