Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 6:49 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పథకాలకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకు భూసమస్యలకు నోటరీ అవసరం లేదు

  • డోంగ్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్

 

మద్నూర్, బతుకమ్మ:  ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నా ఇతరత్ర పనుల నిమిత్తం నోటరీ అవసరమవుతుండడంతో,  డోంగ్లి మండలం మారుమూల సరిహద్దు ప్రాంతంలో ఉండడం వలనా, నోటరీ కోసం బిచ్కుంద,బాన్సువాడ వెళ్ళాలి దూర ప్రాంతాలకు వేల్లలేక ఎక్కడినుండి తీసుకురావాలో తెలవక ఇబ్బంది పడుతున్న ప్రజల అవసరాన్ని  ఆసరాగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు, ఈ విషయం డోంగ్లీ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో,ఉన్నత అధికారుల అనుమతితో ప్రజలు ఎన్ఎఫ్బిఎఫ్, ఫ్యామిలీ మెంబర్, బర్త్ సర్టిఫికెట్, భూమికి సంబంధించిన పనులకు నోటరీ అవసరం లేదని ఎటువంటి ప్రభుత్వ పథకాలు ధ్రువీకరణ పత్రాలు ఉన్న లబ్ధిదారులు  ప్రమాణ పత్రం తీసుకొచ్చి కంప్యూటర్ టైపింగ్ లేదా దానిపైన చేతి రాతతో లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన అది చెల్లుతుంది,కావున ప్రజలు దళారులను నమ్మి నష్టపోవద్దని,స్టాంప్ వెండర్లు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఎ సమస్య ఉన్న ప్రజలు నేరుగా నా దగ్గర రావాలని తహాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.