ఇందల్వాయి రామాలయ భూముల్లో అక్రమ సాగు
కబ్జాలపై నోరు మెదపని దేవాదాయ శాఖ ఇందల్వాయి, బతుకమ్మ : దశాబ్దాల చరిత్ర కలిగిన ఇందల్వాయి రామాలయంలపై దేవాదాయ శాఖ సీతకన్నేసింది. ఒకప్పుడు ఖిల్లా రామాలయానికి సంబంధించిన దేవాతామూర్తుల రక్షణ నిమిత్తం ఇందల్వాయిలో ప్రితిష్టించి పూజలు చేశారని చరిత్ర ఉంది. నాటి సిర్నపల్లి దొరసాని శీలం జానకీ బాయి ఇందల్వాయి రామాలయం పోషణ నిమిత్తం వందకు పైగా ఎకరాల భూమిని చుట్టు పక్కల ప్రాంతాల్లో దేవుని మణ్యంగా అందజేశారు. అంతే కాకుండా కొందరు దాతలు కూడా తాము దేవుని కోసమని భూ దానం చేశారు....