Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 6:21 pm Posted by : ramakrishna

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా….చదువును ఆపొద్దు

 

. . . విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ

 

. . . కోటగల్లి బాలికల పాఠశాలలో పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును అర్ధాంతరంగా ఆపొద్దని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో చక్కగా స్థిరపడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు ఉద్బోధ చేశారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా 60 వేల పునర్వినియోగ సానిటరీ ప్యాడ్లను బాలికలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కోటగల్లి బాలికల పాఠశాలలో 650 మంది బాలికలకు సానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందజేశారు.

 

No matter how many difficulties you face....don't stop studying.

 

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఈ ప్యాడ్లను ఏడాది కాలం పాటు పునర్వినియోగం చేసుకోవచ్చని, వీటిని వాడిన అనతరం శుభ్రపర్చుకుని చక్కగా ఆరబెట్టుకుంటే, తిరిగి వాటినే వినియోగించుకోవచ్చని సూచించారు. నెలసరి విషయంలో బాలికలు ఆందోళనకు లోను కావద్దని, మహిళలకు ఇది ప్రకృతి సహజంగా జరిగే పరిణామమని అన్నారు. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే వైద్య పరీక్షలు జరిపించుకోవాలని సూచించారు. బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, బలవర్ధకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్.బీ.ఐ రీజినల్ మేనేజర్ మహేశ్వరం, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, పాఠశాల హెచ్.ఎం సాయరెడ్డి, ఎస్.బీ.ఐ, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

No matter how many difficulties you face....don't stop studying.