. . . సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని ఠాణంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజాపంత పార్టీ, ఏఐపీకేఎంఎస్ ల ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ.. అక్కడ పనులు చేస్తున్నటువంటి కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని, మండుతున్న ఎండల నుండి రక్షణ కోసం టెంట్ లాంటి ఏర్పాట్లు లేవుని, ఏవైనా దెబ్బలు తగిలితే గాయాలయితే ఫస్ట్ ఎయిడ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవని అన్నారు. పనిచేసే కార్మికులకు పనిముట్లు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వీటిని చూసి పరిశీలించిన తర్వాత పనిచేస్తున్న కార్మికులకు వారం వారం బట్వాడాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కూలీలను ప్రతి వారం ఒకసారి చెల్లించాలని, అదే విధంగా టెంట్లు మంచి నీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఉపాధి హామీ పనులకు అయ్యే ఖర్చులను గతంలో కేంద్ర ప్రభుత్వము 90% ఇచ్చేదని కానీ దాన్ని 60 శాతానికి తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో 10 శాతం మాత్రమే చెల్లించేవని కానీ దాన్ని 40 శాతానికి పెంచిందని దీని మూలంగా రాష్ట్రాల వద్ద నిధుల కొరతతో పనులు జరగక ఈ ఉపాధి హామీ పనులను నిర్వీర్యం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అశోక్, నాగేష్, గంగాధర్, మీరా తదితరులు పాల్గొన్నారు.