సీఎంసీలోకి ఐఎంఎస్ఆర్ చైర్మన్ కు నో ఎంట్రీ
గేటు వద్దే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది లోనికి ప్రవేశించేందుకు యత్నం డిచ్ పల్లి సీఎంసీ వద్ద ఉద్రిక్తత నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి వద్ద గల క్రిస్టియన్ మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎంసీ కళాశాలలోకి వెళ్లేందుకు ఐఎంఎస్ఆర్ (ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్) చైర్మన్ షణ్మగ మహాలింగం ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధీనంలోని వైద్య...