హైదరాబాద్, బతుకమ్మ : కొత్త పార్టీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చించారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నా. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశా. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురిని నేనే. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు’ అని అన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.