సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ ప్రకటన.. ఏం చెప్పిందంటే..
న్యూఢిల్లీ, బతుకమ్మ: భారత్-పాకిస్థాన్ మధ్య తాత్కాలికంగా పాటిస్తున్న కాల్పుల విరమణపై మన ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. సీజ్‌ఫైర్‌కు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఆదివారం జరగాల్సిన డీజీఎంవో చర్చల మీదా క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు ఎలాంటి చర్చలు లేవని తెలిపింది. మే 12వ తేదీన జరిగిన డీజీఎంవోల చర్చల్లో భాగంగా కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. దీనికి ఎటువంటి గడువు లేదని స్పష్టం చేశారు.