కల్తీ కల్లు వద్దు.. జీవితమే ముద్దు
రుద్రూర్, బతుకమ్మ : కల్తీ కల్లు వద్దదని జీవితమే ముద్దని, కల్తీ కల్లు సేవిస్తే అనారోగ్యం బారిన పడతారని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ రమేశ్ అన్నారు. మాదకద్రవ్యాలు, కల్తీ కల్లు కారణంగా తలెత్తే అనర్థాలపై రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేశ్ మాట్లాడుతూ.. కల్తీ కల్లు సేవించడంతో ఆరోగ్యం క్షీణిస్తుందని అన్నారు. ప్రజలు, యువత గంజాయి, కల్తీ కల్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థినులకు క్రీడా సామగ్రిని...