ఏడేళ్లు గడిచినా చర్యల్లేవ్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బిజినెస్ టీచర్లు స్కూల్ ముఖం చూడకుండా తమ సొంత వ్యాపారాల్లో మునిగి తేలడంతో 2018-19 లో అప్పటి కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆర్డీవో విచారణ జరిపి నివేదిక అందజేసినప్పటికీ దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పాఠశాల ముఖం చూడని వాళ్ళు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు చివరికి...