Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 1:34 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి

రైతన్నల కంట నీరు తుడిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వర్ష భావం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కలెక్టర్ టీ. వినయ్ కృష్ణ రెడ్డి ని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాభావం, సాగునీటి కొరతతో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రైతుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీరు విడుదల చేయకపోతే.. రైతుల పక్షాన బీజేపీ వారం రోజుల్లో ఆందోళనలు చేపడుతుందన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.  ప్రతి మండలంలోని రైతులతో కల్సి కలెక్టరేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, పంచారెడ్డి శ్రీధర్, ప్రమోద్,జగన్ రెడ్డి,నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Nizamsagar water should be released