ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్
. ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ నిజాంసాగర్, బతుకమ్మ: ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం సంతోషంగా ఉందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టును ఎంపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయకట్టు రైతులు రెండో పంటకు సిద్ధం కావాలని, ప్రాజెక్టులో రెండు పంటలకూ సరిపడా నీరుందని అన్నారు. రైతుల ఎప్పుడు నీళ్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పర్యాటకులు, స్థానిక నాయకులు ఎంపీతో ప్రాజెక్టుపై సెల్ఫీలు దిగారు.