Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 4:38 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ డీ28 కాలువకు గండి

– ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం

రుద్రూర్,  బతుకమ్మ : నిజాంసాగర్ నుండి కింది ఆయకట్టు వరకు రైతులకు వెళ్లే సాగునీటి కెనాల్ డి28 అనుబంధ కాలువ రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) శివారులో గండి పడింది. ఇరిగేషన్ రెవెన్యూ అనుబంధ శాఖల అధికారులు ఇదివరకే మరమ్మతులు చేపటగా మళ్లీ అదే ప్రాంతంలో గండిపడటం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి తావిస్తోంది. మరొకవైపు కాలువలో పిచ్చి మొక్కలు యధేచ్ఛగా పెరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కాలువ పెద్ద మొత్తంలో తెగి పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ఆయకట్టు రైతులు వెంటనే గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేయించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు.