Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 4:12 pm Posted by : ramakrishna

గణనాథునికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి నిర్వాహకులు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నాయకులు పార్వతి మురళి, సుధాకర్ గౌడ్, ఎముల గజేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.