. . . రెండోసారీ అధ్యక్ష, కార్యదర్శులుగా సుమన్ కుమార్ శేఖర్ ల ఎన్నిక
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గేజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026-29 కి సంబంధించిన నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఎన్ జిఓ కేంద్ర సంఘం అదేశాల మేరకు టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా ఎన్నికలను వ్యవసాయ శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, సహాయక ఎన్నికల అధికారిగా జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీఎన్జీవో నియమావళికి అనుగుణంగా నిర్వహించిన జిల్లా కార్యవర్గం ఎన్నికలలో భాగంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల పదవులతో సహా మిగతా అన్ని పదవులకు గాను సింగిల్ సెట్ నామినేషన్ వచ్చినందున, టీఎన్జీవో జిల్లా సంఘ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల అధికారి ఫలితాలను వెల్లడించారు. గురువారం టిఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా హజరై ఏకగ్రీవంగా ఎన్నికైన టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు పూలమాలవేసి అభినందించి, ఎన్నికల ఫలితాల ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ… ఐక్యతకు మారుపేరు టీఎన్జీవో అన్నట్టుగా… టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, ఏకగ్రీవం అగుటకు సహకరించిన ప్రతి కార్యవర్గ సభ్యులకు కౌన్సిల్ సభ్యులకు పేరుపేరున ఉద్యమాభివందనములు తెలిపారు. నూతనంగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ లు… ఉద్యోగులతో మమేకమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. రాబోవు కాలంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై గౌరవ ఎంప్లాయిస్ జేఎసీ, రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్) ఆదేశానుసారం, నిర్వహించబోయే ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులందరూ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగుల హక్కుల సాధన కొరకు నిర్వహించే పోరాటాలకు సంసిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, టీఎన్జీవో నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు హాజరయ్యారు.
