ప్రయాగ్ రాజ్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ కు చెందిన విద్యార్థి రాహుల్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్ చైతన్య(20) వినికిడిలోపంతో బాధపడుతున్నాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. మూగ, చెవిటి విభాగంలో ఐఐఐటీలో చేరిన రాహుల్ గత మూడు నెలలుగా తరగతులకు హాజరు కాలేదని, ఒత్తిడి, నిరాశతో బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. తన పుట్టిన రోజుకి ముందు రోజే శనివారం(మార్చి 29) రాత్రి హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు...