Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2024, 9:51 pm Posted by : ramakrishna

ఘనంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర

అధ్యంతం ప్రశాంత వాతావరణంలో కొనసాగిన శోభాయాత్ర

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిత్యం వివిధ వార్తా సేకరణలో తలా మునకలైయే జర్నలిస్టులు తొమ్మిది రోజులపాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలుఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి.చివరి రోజైనాసోమవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రప్రెస్ క్లబ్ నుండివినాయక్ నగర్ లోని గణపతుల బావి వరకు తెల్లవారుజామున వరకు శోభయాత్రకొనసాగింది.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడ్పుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైరా శేఖర్ ఆధ్వర్యంలోఈ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా ఎంతో ఆనంద ఉత్సవాల నడుమశోభాయాత్రలో పాల్గొన్నారు.డ్యాన్సులు ఆట పాటలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరిగాయి. అంతకుముందు లడ్డు వేలం పాటలో జర్నలిస్టులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు ప్రెస్ క్లబ్ కోశాధికారి గణేష్ లడ్డూను వేలం పాటలోదక్కించుకున్నారు.సాధారణ ప్రజల మాదిరిగ తాము నిత్యం వార్త సేకరణలతో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తమకు కొంత ఉపశమనం లభిస్తాయని అందుకే ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామనిఅధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.

Nizamabad Press Club Ganesh Nimajjana Shobhayatra