నేడు నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ ఎన్నికలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ అపీసర్స్ క్లబ్ కార్యదర్శి పదవి ఎన్నికకు ఆదివారం పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఎన్నిక అధికారి పి.కిరణ్ కుమార్ గౌడ్,అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఎర్రం విగ్నేష్, బంటు వసంత్, ఉదయకృష్ణ,దోన్పల్ సురేశ్ తెలిపారు. ఆపీసర్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కార్యదర్శి పదవికి పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడిస్తామని అన్నారు.క్లబ్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా అదనపు...