Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 8:55 pm Posted by : ramakrishna

నేడు నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ ఎన్నికలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ అపీసర్స్ క్లబ్ కార్యదర్శి పదవి ఎన్నికకు ఆదివారం పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఎన్నిక అధికారి పి.కిరణ్ కుమార్ గౌడ్,అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఎర్రం విగ్నేష్, బంటు వసంత్, ఉదయకృష్ణ,దోన్పల్ సురేశ్ తెలిపారు. ఆపీసర్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కార్యదర్శి పదవికి పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే  ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడిస్తామని  అన్నారు.క్లబ్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా అదనపు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ క్లబ్ బై లా ప్రకారం కొనసాగనున్న విషయం విడితమేనని పేర్కొన్నారు. మరొక ఉపాధ్యక్ష పదవికి క్లబ్ సీనియర్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఏకగ్రీవంగా ఎన్నికైన్నారని వారు తెలిపారు.

రేపు క్లబ్ వార్షిక సమావేశం..

నిజామాబాద్ అపీసర్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2024 వార్షిక నివేదికను సమర్పించనున్నట్లు క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ తెలిపారు. సభ్యులు సకాలంలో హాజరయ్యి సహకరించాలని కోరారు.