నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇంటర్ ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని గట్ల వరేణ్య స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జిల్లాకి గర్వకారణమని నారాయణ కళాశాల ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థిని గట్ల వరేణ్య ఇంటర్ ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపింది.

అలాగే చంద్ర వర్ధన్ 468, కదం అక్షర 468, భాశెట్టి తన్మాయ్ 466, అమృత వర్షిణి 466, శ్రీనిధి 465, బిలాల్ అహ్మద్ 464, సాధాత్ అలీ 463, బండారి బ్రింద 462, వి భరత్ 462, వరం రుచిక 461, కే. సాత్విక 461, లవంగా అద్వైత్ 460..ఇలా 18 మంది విద్యార్థులు 470కి గాను 460పైగా మార్కులు సాధించారని కళాశాల డీన్ మంజుల, ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు కాను 994 మార్కులతో అయేషా ఆఫీఫా జిల్లాలో మొదటి స్థానం సాధించి సత్తా చాటారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో సింధు హర్షిని 992, సద్ధి అక్షిత 992, సిద్ది ట్యాంక్ 990, వి. కార్తీక 988, బండ సాహితి 984, పి.విరాజ్ 982 ఇలా ఎంపీసీ, బైపీసీ లో కూడా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఇలాగే జెఈఈ, ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి ఏ పోటీపరీక్షలైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో మేదరి శేఖర్, నారాయణ విద్యాసంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
