Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 6:55 pm Posted by : ramakrishna

విద్య ప్రమాణాలలో నిజామాబాద్ నారాయణ పాఠశాల బేష్

. . . నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ పాటిల్

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : నిజామాబాద్ విద్యార్థులకు విద్యాబోధనలో, విద్యా ప్రమాణాలలో 2023-24విద్యా సంవత్సరంలో నిజామాబాద్ నారాయణ పాఠశాల ముందంజలో నిలిచి ప్రతిభ కనబరిచిందని నారాయణ పాఠశాల ఏజీఎం శివాజీ పాటిల్ తెలిపారు . మంగళవారం హైదరాబాద్ లోని నారాయణ గ్రూప్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్షర కన్వెన్షన్ మాదాపూర్ లో నిర్వహించిన కార్యక్రమానికి నిజామాబాద్ నుండి నారాయణ పాఠశాల అధ్యాపక బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ పాఠశాలల డైరెక్టర్ రమాదేవి, జిఎం గోపాల్ రెడ్డి హాజరై నిజామాబాద్ నారాయణ బ్రాంచ్ ఏజీఎం శివాజీ పాటిల్, జోనల్ కోఆర్డినేటర్ కల్పన, ప్రిన్సిపల్ జోష్ణ, విపి అనిలా, ఏవో సురేష్ ను ప్రశంసించి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాల నిజామాబాద్ ఏజిఎం శివాజీ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నారాయణ పాఠశాల నిజామాబాద్ ముందంజలో ఉండే విధంగా కృషిచేసిన తమ నారాయణ నిజామాబాద్ బ్రాంచ్ అధ్యాపక బృందానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు విద్యతోపాటు ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటారో ఆ లక్ష్యం వైపుగా తల్లిదండ్రులు కృషి చేయాలని అప్పుడే విద్యార్థులు అనుకున్న విద్యతోపాటు లక్ష్యాన్ని చేరుకునే స్థాయికి ఎదుగుతారని తెలియజేశారు. ఈ స్థాయి లో నిజామాబాద్ నారాయణ పాఠశాల ముందంజలో నిలిపిన అధ్యాపక బృందం కు, సహకరించిన ల్లిదండ్రులకు,విద్యార్థిని, విద్యార్థులకు, అభినందనలు తెలిపారు.