Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:25 pm Posted by : ramakrishna

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 347.72 కోట్లు 

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టారు. నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తొలి బడ్జెట్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 347.72 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నగర పాలక సంస్థ కమిషనర్ బడ్జెట్ వివరాలను సభా సదులకు వివరించారు. నగరపాలక సంస్థ తొలి బడ్జెట్ సమావేశానికి ఇలా త్రిపాటి, ధన్ పాల్ సూర్యనారాయణ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

Nizamabad Municipal Corporation budget is 347.72 crores

2025-26 బడ్జెట్ రూ. 331 కోట్లు ఉండగా, నూతన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 16 ఆమోదించారు. బడ్జెట్ ఆదాయవ్యయాలను నూతన బడ్జెట్ను ఆమోదించినట్టు తెలిసింది. తొలుత సమావేశం ప్రారంభం కాదని కార్పొరేషన్ లో పరిచయ కార్యక్రమం తో పాటు దివంగత కార్పొరేటర్ లను గుర్తు చేసుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్పొరేటర్లు ఆయా పార్టీల కండువాలను ధరించి సమావేశంలో పాల్గొన్నారు. తొలిసారి బడ్జెట్ సమావేశానికి సగానికి పైగా మహిళలే కార్పొరేటర్లుగా హాజరు కావడం విశేషం.

Nizamabad Municipal Corporation budget is 347.72 crores