Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 12:56 pm Posted by : ramakrishna

బలప్రదర్శనకు వేదికైనా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 

 

 

. .  . మేయర్ ఎంపిక కోసం క్యాంపు ల నుంచి కార్పొరేటర్ ల రాక 

 

. . . ఎక్స్ ఆఫీషియో లుగా హాజరైనా ప్రజా ప్రతినిధులు 

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మేయర్ ఎంపిక కు రాజకీయ పార్టీలు బలప్రదర్శనకు దిగాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు బీజేపీ, అధికార కాంగ్రెస్ సై అన్నాయ్. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కు నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశం ఉదయం ప్రారంభమైంది. సమావేశం కోసం క్యాంపు లకు వెళ్లిన కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ లు బస్సుల ద్వారా నేరుగా మున్సిపల్ కార్యాలయం కు చేరుకున్నారు..

Nizamabad Municipal Corporation becomes venue for show of force

. బీజేపీ కార్పొరేటర్ లతో పాటు ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే లు ధన్ పాల్ సూర్యనారాయణ,పైడి రాకేష్ రెడ్డిలు వచ్చారు. కాంగ్రెస్ కార్పొరేటర్ లతో ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మరో ఎమ్మెల్సీ బలిమూరి వెంకట్, ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు అయ్యారు.

Nizamabad Municipal Corporation becomes venue for show of force

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ 28,కాంగ్రెస్ 17,మజ్లిస్ 14, బి ఆర్ ఎస్ కు 1 కార్పొరేటర్ ఉండగా అధికారం కోసం కాంగ్రెస్, మజ్లిస్ మద్దత్తు తెలుపగ, వారికి కారు పార్టీ మద్దత్తు పలికింది. మెజారటీ రాకపోవడం తో ఎక్స్ ఆఫిషియో ( ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సి ) ల మద్దత్తు తో మేయర్ పీఠం కోసం బలం ప్రదర్శించారు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీఠం కోసం ఎలాంటి సమీకరణలు జరుగతాయి అని ఉత్కంట నెలకొంది. కాంగ్రెస్ మేయర్, మజ్లిస్ డిప్యూటీ మేయర్ అని ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఎన్నికల లాంచానమే అని చర్చ జరుగుతుంది. బీజేపీ కార్పొరేటర్లు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయగా కాంగ్రెస్ వారు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడం తో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Nizamabad Municipal Corporation becomes venue for show of force