ఏఐసిఎం సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ మేయర్
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏఐసిఎం) 117వ కార్యవర్గ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పట్టణాల అభివృద్ధి, ఆధునిక పట్టణ పాలన, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛత, సుస్థిర నగరాభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో దేశంలోని పలు రాష్ట్రాల...