. . . కేంద్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాఫ్ట్ వేర్ 0.2 లో నిజామాబాద్ మార్కెట్ ను ఇంక్లూడ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పసుపు రైతులకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ పాయింట్ టూ ద్వారా వచ్చిన ఇబ్బందులను పూర్తిగా వివరించారు. 2004 నుంచి 2014 వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా కొనసాగిన సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చిన వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించడం జరిగిందన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఆన్లైన్ తీసుకువచ్చి రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కొనుక్కునే అవకాశం కల్పించారని, ఆన్లైన్ వస్తే రైతులకు మద్దతు ధర వస్తుందా లేకుంటే నష్టపోతారా అనే భయం ఉన్నప్పటికీ మొదటగా నిజామాబాద్ లో ఆన్లైన్ పద్ధతి తీసుకురావడం జరిగిందని తెలిపారు. 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం కోల్పోయిన తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో పాయింట్ జీరో పద్ధతిలో ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టిన మొదట ఎన్నో ఇబ్బందులు రావడం జరిగిందని రెండు సంవత్సరాలు దానిని సవరించడానికి సమయం తీసుకుందని ఆయనన్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 0.2 తీసుకురావడం జరిగిందని, గతంలో ఉన్న కాంట్రాక్టర్ తో ఒప్పందం అయిపోవడంతో వేరే వారికి చేయడం ద్వారా సాఫ్ట్వేర్లు నిజామాబాద్ మార్కెట్ ను ఇంక్లూడ్ చేయకుండా బిజెపి కుట్ర చేసిందని, పసుపు బోర్డు నిజామాబాదులో ఉన్నప్పటికీ ఎందుకు నిజమాబాద్ మార్కెట్ ను సాఫ్ట్వేర్లు ఇంక్లూడ్ చేయలేదు అని బిజెపి నాయకులను నగేష్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు పనికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కడే ఉంటూ సాంగ్లీ మార్కెట్లో ఉన్న ధరను ఇక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని , ప్రస్తుతం సాంగ్లీ మార్కెట్లో ఉన్న రేటు నిజామాబాద్లో కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ధర్నా చేసే జైల్లో పెడితే అనంతరం జిల్లా కేంద్రంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ సత్య గ్రహ దీక్ష చేయడం జరిగిందని, వెంటనే వాణిజ్య ఒప్పందం ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. అదే విధంగా అర్వింద్ నిజామాబాద్ లో పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని పసుపు బోర్డు ద్వారా రైతులకు నిజంగా లాభముంటే ఎందుకు పసుపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారో అరవింద్ చెప్పాలని ,పసుపు బోర్డు ద్వారా రైతులకు వచ్చే లాభాలు ఏమీ లేవని పసుపుకు మద్దతు ధర కల్పిస్తే రైతుకు లాభాలు ఉంటాయి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పసుపు కు మద్దతు ధర ప్రకటించేలా అరవింద్ కేంద్రంలో కొట్లాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి కోశాధికారి భక్తవస్తలం డిల్లీ, డిసిసి ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్, పంచారెడ్డి చరణ్, ఎర్రం గంగాధర్, అమర్ సింగ్, నరేందర్, హరిచంద్, డిసిసి ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శివ, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, టౌన్ ఎస్టి సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, సంగెం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.