Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2025, 2:35 pm Posted by : ramakrishna

సాంగ్లీ  మార్కెట్ ను సందర్శించిన నిజామాబాద్ ఎంఏసీ పాలకవర్గం

 

నిజామాబాద్, బతుకమ్మ:

మహారాష్ట్రలోని సాంగ్లీ వ్యవసాయ మార్కెట్ ను నిజామాబాద్ ఎం ఏసీ పాలకవర్గం సందర్శించింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి  ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ జంగిటి రామచందర్, పాలకవర్గం  గురువారం సాంగ్లీ మార్కెట్ యార్డ్ లో ఉన్న పసుపు కళ్ళాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న అధికారులతో అనేక అంశాల గురించి చర్చించారు. అక్కడ పసుపునకు మద్దతు ధర, కొనుగోలు అమ్మకాలు గురించి తెలుసుకున్నారు. వారికి  సాంగ్లీ  మార్కెట్ పాలకవర్గం , అధికారులు స్వాగతం పలికి సన్మానించారు.

Nizamabad MAC ruling class visited Sangli market