జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యార్థుల సత్తా
నిజామాబాద్, బతుకమ్మ : 2026 జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ సి.హెచ్. విజయలక్ష్మి తెలిపారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు విశిష్ట ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి సంస్థకు మరొకసారి కీర్తి తెచ్చిపెట్టారని ఆమె పేర్కొన్నారు. ఫలితాల్లో హెచ్. భరత్ ఆల్ ఇండియా ర్యాంక్ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్. బన్నీ 1334,...